Monday, March 8, 2010

మరో జన్మంటూ ఉంటే...నా అభిప్రాయం



అవును, నాకు మరుజన్మంటూ ఉంటే గనక నేనొక ఆడపిల్లగానే పుట్టాలనుకుంటున్నాను.
నాకు మీ అందరంత తెలియకపోవచ్చు కానీ నాకూ తెలుసు, ప్రస్తుతం మన దేశం లోనూ, వేరే దేశాల్లో కూడా చాలా మంది ఆడవాళ్ళు ఎన్నో కష్టాలు పడుతున్నారు. పోనీ బయటకెళ్ళకుండా ఉంటే కష్టాలు తప్పుతాయా అంటే ఇంట్లో కూడా భయమే. సొంత ఇంట్లోనే మొగుడో లేక అత్తగారో (లేక ఇద్దరూ) చిత్ర హింశలు పెడుతున్నారు.
నేను ఇలాంటీ సంఘటనల గురించి పేపర్లలోనూ, పుస్తకాలలోనూ చదివి "almost" ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అయితే, ఇవన్నీ తెలిసినా కూడా నేను ఆడపిల్లగానే పుట్టలనుకుంటున్నాను. ఎందుకంటే, ఆడపిల్లగా పుట్టడంలో ఏదో ఆనందం ఉంది. మీరు గనక ఆడవారైతే అది మీకూ తెలుస్తుంది. మగవారైతే, మరో జన్మలో ఆడపిల్లగా పుట్టాలని కోరుకోండి, అప్పుడు మీకూ తెలుస్తుంది.
నేనెందుకు ఆడపిల్లగా పుట్టలనుంటున్నను?
· ఇందకనుండి చెపుతున్నాను గా, ఏదో "specialty" ఉంది. అది కేవలం ఆడవళ్ళకే తెలుస్తుంది. దాన్ని ఏ పదాలతోను గానీ, మాటలతోను గానీ, లేక మరేవిధంగానూ వర్ణించలేం.
· దేవుడు శృష్టించిన అన్నీ అద్భుతాలలోకల్లా గొప్ప అద్భుతం స్త్రీ. మీరొప్పుకున్నా, ఒప్పుకోపోయినా ఇది నిజం. కవాలంటే ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించండి, మీకే తెలుస్తుంది.
· ఒక ఆడపిల్ల గా నేను ఈ ప్రపంచంలో ఉన్న తక్కువ అదృష్టవంతులైన ఆడవాళ్ళ కష్టాలను, మగవాళ్ళకన్నా మెరుగ్గా, సాటి ఆడదానిగా (లేదు, నేను సినిమాల్లో వెయ్యట్లేదు, ఈ టపాని కాస్త "serious" గా వ్రాయటాననికి ప్రయత్నిస్తున్నానంతే), అర్థంచేసుకోగలనని నా అభిప్రాయం. నేనుకూడా ఆడపిల్లనే అని గుర్తొచ్చినప్పుటల్లా నాకు వాళ్ళకి ఏదో సహాయం చెయ్యలనిపిస్తూంటుంది. ఎప్పటికైనా నేను వాళ్ళకు కొద్దో గొప్పో సహాయం అందిచడం ఖాయం. అదే నేను మగపిల్లవాడినయ్యుంటే ఆ ఆలోచన వచ్చేందుకు తక్కువ అవకాశాలున్నయి. తరవాత, ఆడవాళ్ళు ఈ "position" దాకా ఎదగటానికి సహాయ పడిన, మరియు సహాయ పడుతున్న మగవారికి "thanks" చెప్పాలంటే, ఆడపలల్లగానే చెప్పాలి. కనీసం దానికోసమైనా ఆడపిల్లగా పుట్టలి.
· నేనొక ఆడపిల్లనైతేనే కదా, ఆ "ఆడవాళ్ళకు-ఏమీ-చేతకాదని అనుకునే మగవాళ్ళకు" ఆడవాళ్ళ గొప్పను చూపించగలిగేది.
By the way, నాకు సుధా మూర్తి రాసిన పుస్తకలంటే చాలా ఇష్టం. ఆవిడ రాసిన ఒక షార్ట్ స్టోరీ సంకలనం నుండి నేను చదివిన ఒక సంఘటన ఇది:
లలిత ఒక పల్లెటూరి అమ్మాయి. పెళ్ళయ్యి చాలా రోజులే అయినప్పటికీ వాళ్ళాయినా ఇంకా వాళ్ళత్తగారు తనని కట్నం కోసం పీడిస్తూనే ఉన్నారు. ఎంత డబ్బిచ్చినా అసంతృప్తే. ఓ పిల్లో పిల్లాడో పుడితే అంతా సర్దుకుంటుందనుకుంటే, పరిస్థితి ఇంకా దిగజారిపోయింది. చివరికి ఒక రోజు, తలితండ్రులను హాస్పిటల్లో కలవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒంటి నిండా కాలిన గాయాలు. ఒక పక్కన పిల్లాడి ఏడ్పు. సుధా మూర్తి ఆ హాస్పిటల్లోనే ఆవిడ స్నేహితురాలిని కలవటానికి వచ్చి, లలితను చూసి అడిగింది, "ఇంత ఘోరంగా ఎలా కాలింది? ". దానికి లలిత, "వంట చేస్తుంటే గ్యాస్ సిలిండరు పేలింది.“ అనిచపప్పింది. బయటకొచ్చి లలిత తల్లిని అడిగింది, "గ్యాస్ సిలిండర్ పెలిందన్నారు, మిగతా వాళ్ళందరూ క్షేమమేనా? ". దానికి ఆవిడ, "లలిత ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఎక్కడిదండి?
"అంటే…?"
"అవును, లలితను వాళ్ళ అత్తింటివారే తగలపేట్టారు."
"నిజంగానా?”
"అవును. ఏదో తెలిసినవాళ్ళు కదా, పెళ్ళిచేస్తే భద్యత తీరిపోతుందనుకున్నాము. కానీ వాళ్ళింత దుర్మార్గులనుకోలేదు. లలితే నాతో చెప్పింది. వాళ్ళత్తగారు తన నోరుమూసి కాళ్ళూచేతులు కట్టేసిందట. వాళ్ళాయినే కిరసనాయిలు పోసి తగలపెట్టాడు. ఆ తరువాత వాళ్ళత్తగారు ఇరుగుపొరుగు వాళ్ళతో లలిత మంచిదికాదని, ఆ విషయం వాళ్ళాయనకు తెలిసిపోయిందని ఆత్మహత్య చేసుకోవాలిని ప్రయత్నించిందని చెప్పారు. ఊరిజనం ముందు కూడా చెడ్డదియిపోయింది లలిత. ఇంక తను బ్రతుకకూడదండి, చనిపోవటమే తనకి సుఖం."
"మీరే ఇలా అంటే ఎలా? నా స్నేహితురాలితో చెప్పి…"
"వద్దమ్మా! అందరిముందూ తనని చెడ్డదాన్ని చేశారు. తను పోతేనే మేమూ సంతోషిస్తాము" అంటూ, ఏడూస్తూ వెళ్ళి పోయింది లలిత తల్లి. ఈలోగా లలిత పడుకున్న గదినుండి పెద్ద ఏడుపు. వెళ్ళి చూస్తే లలిత వాళ్ల చెల్లెలు ఏడుస్తోంది, చాలా గట్టిగా. తనెత్తుకున్న బాబుకూడా బోరుమని ఏడుస్తున్నాడు. కానీ లలిత మాత్రం ఏడవట్లేదు. తనకి ముందునుంచే తెలుసేమో, తన కష్టాలన్నీ శాస్వతంగా ముగిసిపోతాయని.
బయటకు వెడుతూ ఒక్కసారి వెనక్కి చూసింది సుధా మూర్తి. ఆ గదిలో ఎంతో మంది ఆడవాళ్ళు. అందరి శరీరాల మీదా కాలిన గాయాలే.
"వారిలో ఒక్కరివైనా గ్యాస్ సిలిండరు పేలటం వలన అయ్యిన గాయాలైతే బాగుండేది" అని తనకుతాను సర్దిచెప్పుకుంటూ తలుపు వైపు నడిచింది.


ఇలాంటి సంఘటనలు వేలకువేలు మనం వింటాం, చదువు్తాం. కానీ మనకు తెలియనివి ఇంకెన్నో! ఇవి వినగానే మనకు ఎక్కడో, ఎందుకో బాధగా ఉంటుంది.
ఇలాంటివి చదివితే అనిపిస్తుంది, మరో జన్మంటూవుంటే ఆడపిల్లగా పుట్టకూడదని. ఎందుకంటే ఒక ఆడపిల్లగా పుడితే, "probability of exploitation” చాలా ఎక్కువ ఉంది. అలా అని ఏ రాక్కుమారిగానో పుట్టాలని, లేక ఒక ధనవంతుడింట్లో పుడితే కష్టాలు తప్పుతాయనుకోకండి.
నేను మొన్నీమధ్యన, "Princess" అనే ఒక నవల చదివాను. అది ఒక గల్ఫ్ దేశపు రాక్కుమారి, సుల్తానా (నిజమైన పేరు కాదులెండి) గురించి రసినదన్నమాట. ఆ పుస్తకం చదివితే తెలిసింది నాకు చివరికి ధనవంతుల కూతుళ్లకూ, పెళ్ళాలకు కూడా ఈ "gender-based" కష్టాలు తప్పవని. ఆ పుస్తకాన్ని రాసి ప్రచురించటానికే రాసినావిడ తలప్రాణం తోకకొచ్చిందట. ఆ పుస్తకం నిండా సుల్తానా జీవితానుభవాలే. పుట్టినప్పటినుండి వాళ్ళ నన్న ప్రేమకోసం ఎదురుచూస్తూ ఉంటుంది, సుల్తానా. పెరిగి పెద్దవుతున్న కొద్దీ తనకు తన చుట్టుపక్కలుండే ఆడవాళ్ళ పరిస్థితి మెల్ల మెల్ల గా అర్థమవుతూ ఉంటుంది. వాళ్ళ అక్కకు పదహారో సంవత్సరం వచ్చేసరికి ఒక ఎనభై సంవత్సరల ముసలివాడికి నాలుగవ పెళ్ళం గా పంపిస్తారు. వాళ్ళ అమ్మ పోయిన రోజు రాత్రే వాళ్ళ నన్న ఓ పదహారేళ్ళ అమ్మయిని పెళ్ళిచేసుకుంటాడు. తన స్నేహితురాలు పరిచయం లేని మగాడితో మాట్లాడిందని తనని రళ్ళతో కొట్టి చంపేస్తారు, తన కుటుంబ సభ్యులే. వేరే మతం వాడిని ప్రేమించినందుకు, మరణించేదాకా చీకటి గదిలో బంధిస్తారు ఒక అమ్మాయి తలితండ్రులు. ఇవన్ని చూసి కడా కన్నీరు కార్చడం తప్ప ఏం చెయ్యలేదు సుల్తానా.

కాని, ఇవన్నీ చదివిన వెంటనే ఏమనిపించినా, ఆ తరువాత మాత్రం మళ్ళీ మామూలే. నాకు ఆడపిల్లగానే పుట్టలనిపుస్తుంది, ఎందుకో. బామ్మలనడిగితే పురుషజన్మ శ్రేష్టం, etc. లాంటి కబుర్లు చెబుతారు. కానీ నాకు మాత్రం అమ్మాయిగా పుట్టడమంటేనే ఇష్టం, ఎవరేమన్నాసరే. అందరూ అఓటూ ఉంటారుకదా, ఈ మగాళ్ళందరూ ఇంతే, ్మీ మగజాతే ఇంత అని. Maybe అందుకేనేమో, నాకిలా అనిపిస్తుంది.
మిగతావాళ్ళుకూడా ఆడజన్మను గౌరవించాలంటే ఈ లోకం మారాలి, అంటే ప్రతీ దేసం మారాలి, అంటే ప్రతీ ఊరూ మారాలి, అంటే ప్రతీ కుటుంబం మారాలి, అంటే ప్రతీ మనిషి మారాలి.

NOTE: THESE ARE JUST MY PERSONAL OPINIONS AND VIEWS. PLEASE DO NOT TAKE THEM SERIOUSLY AND PERSONALLY. THANKYOU.

8 comments:

  1. Very good Sravya,, keep it up. and continue ur blogging in ur holidays .. All the best..

    ReplyDelete
  2. శ్రావ్యా,
    చిన్నదానివైనా చాలా పెద్ద విషయాలు ఎంతో బాగా చెప్పావు.
    నువ్వు చెప్పిన సుధా మూర్తి గారి అనుభవం చదువుతుంటే.. కళ్ళు చెమర్చాయి. నువ్వన్నట్టు ప్రతీ అమ్మాయికి కలిగే అదే భావన!
    అలాగే, సుల్తానా కథ కూడా..! నీ ఆలోచనలూ, అభిప్రాయాలూ మాతో పంచుకున్నందుకు అభినందనలు.

    ReplyDelete
  3. శ్రావ్యా,
    చాలా బాగా వ్రాసావు. నీలో ఆలోచన వుంది. అర్ధం చేసుకోవాలనే తపన వుంది. భావావేశం వుంది. తెలిసేలా చెప్పగల సామర్ధ్యం వుంది. ఇంత చిన్న వయసు లోనే లోకాన్ని అర్ధం చేసుకుందుకు ప్రయత్నిస్తున్నావంటే భవిష్యత్తులో చాలా గొప్పదానివవుతావు. ఆ భగవంతుడు నీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నాను..

    ReplyDelete
  4. శ్రావ్య...
    చాలా చాలా ఆవేశ౦గా రాశావు..ఒకటికి పదిమార్లు ఆడపిల్లగానే పుట్టాలనుకున్నావ్...
    చాలా బాగు౦ది..ఇదే మొదటిసారి నీ బ్లాగ్ కి రావట౦ బాగు౦ది..నాకు ఎ౦దుకో మాటచెప్పలని ఉ౦ది..నాకు ఎప్పుడు అనిపిస్తు౦ది మన౦ తప్పక మారాలని లలిత మారాలి..
    లలిత తల్లి మారాలి..లలిత ఊరిలోని ప్రతి ఆడది మారాలి..సుల్తనా పరిస్దితికి వస్తే మారటానికి ఏమి లేదు ....మారితే కాదు మారాలనుకు౦టేనే చ౦పేస్తారు..అలా౦టీ మార్పు కోరుకు౦టూ...

    ReplyDelete
  5. నీ ఆలోచనలు, అభిప్రాయాలూ చదువుతుంటే ఎంతో గర్వంగా వుందమ్మా . నువ్వు కొత్త తరానికి వారసురాలివి . విజయోస్తు

    ReplyDelete
  6. శ్రావ్యా ,
    చాలా ఆవేశం గా , చాలా చాలా బాగా చెప్పావు .
    నీనుంచి నికా అమంచి మంచి పోస్ట్ లు రావాలి . గుడ్ .

    ReplyDelete
  7. శ్రావ్యా,
    చాలా బాగా రాసావమ్మా.

    ReplyDelete
  8. thanks for your compliments. yes, i will be continueing blogging after finishing my boards

    ReplyDelete