26 నవంబరు 2008
నేనూ, మా తమ్ముడూ మామూలుగానే స్కూలుకి తయ్యారయ్యి, బస్సు స్టాపులో నుంచొని ఉంటే, ఒక అంకులొచ్చి ఆ రోజు స్కూలు లేదని చెప్పారు. మొదట సెలవని ఆనంద పడినా, ఆ తరువాత న్యూసు లో చూసినతరువాత, ఎంతో భయమేసింది. ఇది ఇండియాకి 9/11 వంటిదని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడు న్యూసు చానలు చూడని మేము, రెండు రోజుల నుండి న్యూసు చానలు ఒక్కటే చూస్తున్నాము.
ఇప్పుడు ఎక్కడకెళ్ళeలన్నా, ఏంచెయ్యాలన్నా భయమే. ఆ ఆతంకవాదులు ఎదో వ్రతం పెట్టుకున్నట్లు 5000 మంది ని చంపాలని వచ్చారట. తాజ్ వంటి గొప్ప భవనాన్ని ధ్వంశం చేసారు. ఇవన్నీ ఆలోచిస్తే, నాకొక ఆలోచన వచ్చింది. మనం ఆతంకవాదుల ద్వారా చాలా విషయాలు నేర్చుకోవాలి.
1. వాళ్ళ "planning". అసలు వాళ్ళు ఎంత గొప్ప ప్లానులు వేసారంటే, వాళ్ళనుకునే పని తప్పక నెరవేరేదే. ఎంతో జాగ్రత్త గా, ఒక్కొక్క అడుగు ప్లాన్ చేసుకున్నారు. ఒకవేళ, మన ప్రభుత్వం కూడ అంత పక్కా ప్లానులు వేస్తే, మన దేశం ఎప్పుడో "flourish" అయ్యేది.
2. వాళ్ళ "planning" మీద నమ్మకం. వాళ్ళెంత "confidence" తో ఉన్నారంటే, వాళ్ళు తిరిగెళ్ళే ప్లాను కూడా వేసారు. ఈ ఆత్మవిశ్వాసం మంచి ప్లాను వేసినప్పుడే సాధ్యం అవుతుంది. ఈ "confidence" తో పాటు ధైర్యం కూడా అవసరం.
సమంష్టి కృషి: వాళ్ళలో ఎంత "coordination" లేక పోతే అలాంటి పనిని అంత ధైర్యం గా చెయగలరు? వాళ్ళు "ఒకరికి ఒకరు" అనుకుంటూ మొత్తం ప్లాను అంతా అమర్చుకున్నారు.
వాళ్ళు నిర్వహించే పని చాలా రిస్క్ తో కూడినది. ప్రతీక్షణం ప్లాను ఎలా అయినా మారచ్చు. కానీ బుర్ర ఉపయోగించడం అన్నిటికన్నా ముఖ్యం. వారి తెలివితేటల తో పాటు తొందరగా నిర్ణయం కూడా తీసుకో గలగాలి. ఒక క్షణం కూడా ఆలోచించటానికి సమయం ఉండదు, వారి దగ్గర.
ఇలా, మీరూ అలోచిస్తే, మీకుకూడా ఎన్నో విషయాలు కనిపిస్తాయి. కాని, ఈ లక్షణాలన్నీ సరియైన పద్ధతి లో ఉపయోగిస్తేనే మనకి మంచి చేస్తాయి. లేక పోతే, ఇదిగో, చూసారుగా ఏమయ్యిందో.
నేను ఈబ్లాగు టపా టెర్రరిస్టుల గురించి మీకు సమాచారం ఇద్దామని మొదలు పెట్టి చివరికి ఇక్కడ తేలాను. నాకనిపించిందీ, మీ అందరికి వీటి గురించి తెలిసే ఉంటుందని. (అందులో, నేను కాస్త బద్ధకస్తురాలిని కూడా కాబట్టి, నా ఆలోచన నాకే తెగ నచ్చేసింది.)
ఈసారి టపా ముగించే ముందు, మా క్లాసులో జరిగిన ఓ రెండు జోకులు చెప్తా.
నేను హైదరాబాదు లో ఉన్నప్పుడు, మా తెలుగు సారు ఎన్నో జోకులేసేవారు. క్లాసు అయ్యేదాకా మేము నవ్వుతూనే ఉండే వాళ్ళం. "transfer" అయ్యినప్పుడు ఆయన జోకులు "miss" అవుతానేమోననుకున్నాను. కానీ, ఇక్కడ హిందీ సారు కూడ మా తెలుగు సార్లానే ఉన్నారు .
మొన్న క్లాసులో ఒక అబ్బాయి బాగా అల్లరి చేస్తుంటే ఆయన, " ఏమిటి బాబూ, ఇంత పెద్ద దాడి చేసినా కూడ తనివితీరలేదా (ఆ అబ్బాయి టెర్రరిస్టని అర్ధం)!
మర్నాడు, మాకో లేఖ వ్రాయమని చెప్పారు. అయితే, ఒక అబ్బాయి సార్ ని అడిగాడు, " సార్, చిరునామా ఏమి వ్రాయాలి? " దానికి సార్,
“ఒక బతికున్న ఆతంకవాదుడు,
లష్కార్ ఈ తైబా
కరాచి
పాకిస్తాన్"
ఇలా అనగానే, నాకెంత నవ్వొచ్చిందంటే…:))))
Wednesday, December 10, 2008
Subscribe to:
Post Comments (Atom)
ముంబాయి నగరం పై ఉగ్రవాదుల దుశ్చర్య ఖండించాల్సిందే. అది ఎంతో విషాదాన్ని మిగిల్చింది. ఇలాంటి విపత్కర పరిస్థితులలో కూడా ధైర్యం కోల్పోక, రెండు జొకులు చెప్పి, నువ్వు నవ్వి మమ్ములని నవ్వించావు. ఇప్పుడు ముంబాయి లో జీవితం మరలా ఎప్పటిలా ఉరకలు-పరుగులుగా మారి ఉంటుందని తలుస్తాను. ముంబాయిలో నీ కొత్త స్నేహితుల గురించి రాసినట్లు లేదు. ఇంకా ఎవరూ స్నేహితులు కాలేదా?
ReplyDelete-cbrao
San Jose, CA
నీ ఆలోచన నాకూ నచ్చింది :)
ReplyDeleteWell done.
అవును నిజమే. మన భారత ప్రభుత్వం కి కాస్త ముందుచుపు ఉంచి వెవహరించి ఉంటె ఆ ఉగ్రవాదుల దాడి నుంచి మనం తప్పిచుకునె వాల్లమెమొ. మీ అలొచన బాగుంది.
ReplyDeleteషైక్.ఇలియాస్
బావుంది... వాళ్ల నుంచి కూడ నేర్చుకునే విషయాలు చూపించడం ఇంకా బావుంది :)
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteSravya,
ReplyDeletenuvvu rasinavanni chadivaanu....chaala baaga rasthunnavu. intha chinna vayasulo neeku intha ooha unnanduku naaku chaala aanandamga undi. koncham garvamga kuda undi..neeku pinnini ayinanduku.....))))))
Ujwala
Des Moines
Iowa