Friday, March 21, 2008

నా మొదటి టపా

మొన్న కృష్ణ కాంత్ పార్కు లో జరిగిన మీటింగు బాగా అయ్యింది. అప్పుడు అందరికి నేను త్వరలో ఓ బ్లాగు ప్రారంభిస్తా అని మాటిచ్చా. ఆ తరవాత, మీరంతా నా బ్లాగు కోసం ఎదురుచూస్తున్నారని విన్నా. అందరికి నా ధన్యవాదాలు.
మా నాన్నగారు తెలుగు లో వ్రాయడం మొదలు పెట్టినప్పటి నుండి నాకు కూడా తెలుగు లో వ్రాయాలని కోరిక పుట్టింది. సరే, ఓ బ్లాగు మొదలెడితే బాగుంటుంది అని, చివరికి "వరాళి వీచికలు" అనే ఈ బ్లాగు మొదలెట్టా. ఏపేరు పెట్టను అని కనిపించిన వాళ్ళందరినీ అడిగా. చివరికి మా అమ్మ నాకే కాక నాబ్లాగుకి కూడా పేరెట్టింది.

నాకు తెలుగు వ్రాయడంలో అంత అనుభవంలేదు కానీ, ఏదో , బానే వ్రాస్తానని నమ్మకం. అయితే ఈ బ్లాగు లో ముఖ్యంగా నా ఆలోచనలు , రోజువారీ జరిగే సంఘటనలు , వాటి మీద నా అభిప్రాయం వ్రాయలనుకుంటున్నా. ఇవన్నీ మనం సాధరణంగా మాట్లాడుకునే భాషలో వ్రాయాలని నిర్ణయించుకున్నా. కానీ……. ఏమిటంటే, "వ్రాయడం" అని వ్రాసేబదులు "రాయడం" అనడం లో ఎవరికైనా అభ్యంతరం ఉందా??? మరీ వేసి రుద్దినట్లు ఉండదంటే, తరవాత బ్లాగు నుండి అలాగే వ్రాస్తా (రాస్తా).

ముందే చెప్పాగా, నేను మొన్న మీటింగు జరిగినపుడు నాన్నగారితో వెళ్ళానని . బానే ఉంది కానీ ఇంకా మంచిగా చెయ్యచ్చు(దాని గురించి ఓ టపా రాస్తాన్లెండి) . మొదటి టపా కదా, చిన్నదేలేండి. రెండో టపా పెద్దగా ఉండటానికి సరిపడా సంగతులు వెతుకుతా.

15 comments:

  1. హాయ్ శ్రావ్య,

    బ్లాగ్లోకానికి సుస్వాగతం. ఐతే మీ నాన్నగారు నీకు కూడా తెలుగు అంటించారన్నమాట. అమ్మను జాగ్రత్తగా ఉండమను. ఓకేనా. నీదైన స్టైలులో రాయి అచ్చు తప్పులు లేకుండా ఉంటే సరి. అంతలా ఐతే ఎప్పటికప్పుడు నీ తప్పులు దిద్దుతాములే..

    ఒక చిన్న సూచన.. నీ బ్లాగును కాస్త అందంగా చేయి. ఏ రెండురోజులు సెలవే కదా. హెల్ప్ కావాలంటే నేనున్నాగా>

    ReplyDelete
  2. మీ రెండవ టపా కోసం వేయి కళ్ళతో (వేయి కిటికీలలో) ఎదురు చూస్తున్నామ్, ముఖ్యంగా మీటింగ్ ఇంప్రూవ్ చెయ్యడం గురించి, వి ర్యేన్ అవుట్ ఆఫ్ ఐడియాస్ నీడి యంగ్ జనరేషన్ టూ టేక్ ఓవర్!

    వ్రాయడం, రాయడం తేడా తెలీనంతవరకూ పర్వాలేదు కానీ తేడా తెలిసిన తరువాత నేను వ్రాస్తున్నాను, రాయట్లేదు :)

    ReplyDelete
  3. మహదానందంగా ఉంది. చక్కటి పేరు పెట్టిన మీ అమ్మగారికి అభినందనలు. ఇకనించీ చక్కగా "రాసేస్తూ " ఉండు. విషయాలకి కొదవ ఏవీ లేదు. నచ్చిన నచ్చని దేణిమీదైనా రాసెయ్యొచ్చు. టీవీ షోలు, సినిమాలు, పుస్తకాలు, బళ్ళో సంఘటనలు, ఇంకా రోజువారీ ప్రపంచంలో నువ్వు చూసే వింతలు .. ఎన్నో! విపులాచ పృథ్వీ!!

    ReplyDelete
  4. శుభమస్తు, అవిఘ్నమస్తు!!

    ReplyDelete
  5. Dear శ్రావ్య,

    నీ బ్లాగు పేరు బాగుంది.బ్లాగు వాడుక భాషలో బాగా వుండగలదు.నీ వచ్చే టపా, ఇంకా బాగా రాస్తావని, ఆశ.

    cbrao

    ReplyDelete
  6. ఎన్నో ఆశీర్వాదాలు, అభినందనలు....

    ReplyDelete
  7. కామెంట్ పోస్ట్ చేసిన వారందరికి నా కృతఙ్ఞతలు. నాకు చాలా ప్రోత్సాహకరంగా అనిపించింది. సరే , ఇప్పుడు అందరు ఎకాభిప్రాయం తో చెప్పండి, నేను వ్రాయాలా లేక రాయాలా??

    జ్యొతి ఆంటి, అందంగ చెయటానికి నాకేమి అభ్యంతరం లేదు కానీ, అది రావటానికి చాలా సమయం పడుతుంది. అందుకే ఆగిపొయా.

    ReplyDelete
  8. వ్రాసినా, రాసినా ఓకే. ఆ రోజు నీ పేరులోని నూతనత్వం గురించి చర్చ జరిగింది. మరి బ్లాగులో కూడా కొత్తదనం చూపిస్తావని ఆశిస్తాం. మొదటి మీటింగ్‍కి వచ్చే ఇంప్రూవ్ చెయ్యడం అంటున్నావంటే ఏదో కధ ఉందన్నమాట. త్వరగా చెప్పేయ్.

    దూర్వాసుల పద్మనాభం

    ReplyDelete
  9. స్వాగతం! చక్కగా "రా"సావు. మీటింగు అంత బాగా ఏమీ జరగలేదని సున్నితంగా, బానే చెప్పావు. నీ సూచనలకోసం ఎదురు చూస్తాను.

    ReplyDelete
  10. శ్రావ్య,

    వ్రాయడానికి కష్టపడకుండా హాయిగా రాసేయి. మేము అలాగే రాస్తుంటాము మరి. ఒకసంగతి చెప్పనా.. గులాబ్ జామున్ స్పూనుతో ముక్కలు చేసుకుని తిన్నా, మన చేత్తో పట్టుకుని కొరికి తిన్నా దాని రుచి మారదుగా.. ఇదీ అంటే..

    కీపిటప్...

    ReplyDelete
  11. నీవు అడుగిడిన క్షణం
    బ్లాగోత్సవాల రంగుల రంగేళి కావాలని
    నడుస్తున్న దారిలో పూస్తున్న పూలై నీ రాతలు విరియాలని
    తెలుగురాస్తూ బ్లాగుతున్నందుకు అభినందనలు.

    జాన్ హైడ్ కనుమూరి

    ReplyDelete
  12. తెలుగు బ్లాగు లోకానికి స్వాగతం... మీ నాన్న గారు ఎవరండి..

    ReplyDelete
  13. రాయి లేదా వ్రాయి నీ ఇష్టం
    నీకంటూ ఒక ప్రత్యేకత చూపించుకొ.

    ఎంత రాసామన్నది కాదు, ఎం రాసామన్నదే ముఖ్యం

    - కిరణ్
    ఐతే OK [aithesare.blogspot.com]

    ReplyDelete
  14. సరే. మీ అభిప్రాయం నాకు తెలిసింది. త్వరలో కొత్త బ్లాగు "రా"సేస్తా.

    థాంక్స్, మీ కమెంట్స్ కోసం

    -శ్రవ్య వరాళి

    ReplyDelete
  15. చిన్నప్పుడు మా అమ్మ నాతో తాతయ్యకు తెలుగులో ఉత్తరాలు రాయించేది. ఎంత సంతోషపడిపోయేదో, నన్ను మెచ్చుకోవడమే కాక నలుగురికి చెప్పి గర్వపడేది. అటువంటి గొప్ప ఆనందాన్ని మీ నాన్న గారికి కలుగజేయడం ఎంతో గర్వపడాల్సిన విషయం.

    గుడ్ జాబ్.

    ReplyDelete