Showing posts with label తెలుగు. Show all posts
Showing posts with label తెలుగు. Show all posts

Friday, March 21, 2008

నా మొదటి టపా

మొన్న కృష్ణ కాంత్ పార్కు లో జరిగిన మీటింగు బాగా అయ్యింది. అప్పుడు అందరికి నేను త్వరలో ఓ బ్లాగు ప్రారంభిస్తా అని మాటిచ్చా. ఆ తరవాత, మీరంతా నా బ్లాగు కోసం ఎదురుచూస్తున్నారని విన్నా. అందరికి నా ధన్యవాదాలు.
మా నాన్నగారు తెలుగు లో వ్రాయడం మొదలు పెట్టినప్పటి నుండి నాకు కూడా తెలుగు లో వ్రాయాలని కోరిక పుట్టింది. సరే, ఓ బ్లాగు మొదలెడితే బాగుంటుంది అని, చివరికి "వరాళి వీచికలు" అనే ఈ బ్లాగు మొదలెట్టా. ఏపేరు పెట్టను అని కనిపించిన వాళ్ళందరినీ అడిగా. చివరికి మా అమ్మ నాకే కాక నాబ్లాగుకి కూడా పేరెట్టింది.

నాకు తెలుగు వ్రాయడంలో అంత అనుభవంలేదు కానీ, ఏదో , బానే వ్రాస్తానని నమ్మకం. అయితే ఈ బ్లాగు లో ముఖ్యంగా నా ఆలోచనలు , రోజువారీ జరిగే సంఘటనలు , వాటి మీద నా అభిప్రాయం వ్రాయలనుకుంటున్నా. ఇవన్నీ మనం సాధరణంగా మాట్లాడుకునే భాషలో వ్రాయాలని నిర్ణయించుకున్నా. కానీ……. ఏమిటంటే, "వ్రాయడం" అని వ్రాసేబదులు "రాయడం" అనడం లో ఎవరికైనా అభ్యంతరం ఉందా??? మరీ వేసి రుద్దినట్లు ఉండదంటే, తరవాత బ్లాగు నుండి అలాగే వ్రాస్తా (రాస్తా).

ముందే చెప్పాగా, నేను మొన్న మీటింగు జరిగినపుడు నాన్నగారితో వెళ్ళానని . బానే ఉంది కానీ ఇంకా మంచిగా చెయ్యచ్చు(దాని గురించి ఓ టపా రాస్తాన్లెండి) . మొదటి టపా కదా, చిన్నదేలేండి. రెండో టపా పెద్దగా ఉండటానికి సరిపడా సంగతులు వెతుకుతా.